భ‌క్తుల‌కు షాకిచ్చిన టీటీడీ..

-

దేశంలో కరోనా మ‌హ‌మ్మ‌రి వ‌ల్ల విధించ‌బ‌డిన లాక్‌డౌన్ అనంత‌రం దాదాపుగా 70 రోజుల‌కు ఇప్పుడు మ‌ళ్లీ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తెరుచుకోనున్న సంగ‌తి తెలిసిందే. జూన్ 11 నుంచి భ‌క్తుల‌కు మ‌ళ్లీ ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. అందులో భాగంగానే మంగ‌ళ‌వారం నుంచి టీటీడీ ఉద్యోగులు, స్థానికుల‌కు ద‌ర్శ‌నానికి అనుమ‌తిచ్చారు. ఇక ద‌ర్శ‌నానికి బ‌య‌ల్దేరుతున్న భ‌క్తుల‌కు టీటీడీ షాక్ ఇచ్చింది. అలిపిరి వ‌ద్ద టోల్‌గేట్ చార్జిల‌ను భారీగా పెంచుతున్న‌ట్లు తెలిపింది.

ttd increased alipiri toll gate charges

అలిపిరి టోల్‌గేట్ వ‌ద్ద పెరిగిన చార్జిల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

* లైట్ మోటార్ వెహిక‌ల్ రూ.50 (గతంలో రూ.15 ఉండేది)
* మినీ వ్యాన్ రూ.100 (గ‌తంలో రూ.60 వ‌సూలు చేశారు)
* బ‌స్సులు, లారీలు, ఇత‌ర భారీ వాహ‌నాలు రూ.200 (గ‌తంలో రూ.100 ఉండేది)

కాగా పాల‌కమండ‌లి నిర్ణ‌యాల మేర‌కే టోల్ చార్జిల‌ను పెంచిన‌ట్లు టీటీడీ తెలిపింది. ఈ క్ర‌మంలో భ‌క్తులు కొత్త చార్జిల ప్ర‌కారం డ‌బ్బు చెల్లించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news