దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు టీటీడీ శుభవార్త

-

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా డిసెంబరు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను ఈనెల 24 న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే దివ్యాంగులు, ఐదేళ్ల లోపు పసిబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీటీడీ ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ టికెట్లను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

TTD seeks land for Venkateshwara temple at Ayodhya; says cow is national  animal | Latest News India - Hindustan Times

భక్తులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ టికెట్లను పొందవచ్చని తెలిపింది. నకిలీ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేసింది. కాగా, ప్రతి నెలలోనూ రెండు రోజులు దివ్యాంగులు, ఐదేళ్ల లోపు పసిబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీటీడీ తిరుమల వెంకన్న దర్శన భాగ్యం కలుగజేస్తోంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆన్‌లైన్‌లో ఉచిత ద‌ర్శన టోకెన్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ అధికారులు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news