రాజకీయాల్లో ఇది నికృష్టమైన చర్య.. పార్టీ మార్పు మీద తుమ్మల కంప్లైంట్ !

సోషల్ ‌మీడియాలో తనపై దుష్ర్పచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని  ఖమ్మం సీపీని కోరారు మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వర్‌రావు. రాజకీయంగా తనను దెబ్బ తీసేందుకు పార్టీ మారుతున్నట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తిగత లాభం కోసం తాను ఎప్పుడూ చూసుకోలేదని , సీఎం కేసీఆర్‌ అసాధారణ రీతిలో తనను గౌరవిస్తున్నారని, ఇలాంటి తరుణంలో కొంత మంది రాజకీయ లబ్ధి కోసమే తనపై దుష్ప్రచారం  చేస్తున్నారని అన్నారు.

అవాస్తవాలను రాజకీయ లబ్ధి కోసమే నా ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం కోసం చేస్తున్నారని ఆయన అన్నారు. అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశానని ఆయన అన్నారు.  రాజకీయాల్లో ఇది నికృష్టమైన చర్యని పేర్కొన్న ఆయన 40 ఎల్లా పాటు జిల్లా అభివృద్ధికి పాటు పడ్డాను అని అన్నారు. ఓడిపోయిన నన్ను కేబినెట్ లో పెట్టారన్న ఆయన 20 వేల కోట్ల ఇరిగేషన్ నిధులు సీఎం కేసీఆర్ జిల్లాకు ఇచ్చారని అన్నారు.