లిక్కర్ కేసులో కవిత మేనల్లుడు..!

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గంట గంటకి కొత్త కొత్త ట్విస్టులు నమోదు అవుతున్నాయి తాజాగా ఈ కేసు లో కొత్త పేరు తెర మీదకు వచ్చింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేనల్లుడు మేక శరన్ పేరుని కోర్టు లో సమర్పించిన అఫీడివిటి లో ప్రస్తావించారు కవిత ఇంట్లో జరిపిన సోదాల్లో మేక శరన్ ఫోన్ దొరికింది. రెండుసార్లు పిలిచిన శరన్ విచారణకి రాలేదని కోర్టు కి తెలియజేసింది.

మేక శరణ్ కవితకి అత్యంత సన్నిహితుడని కవిత అరెస్ట్ టైం లో శరణ్ ఇంట్లోనే ఉన్నారని అఫిడవిట్లో పేర్కొంది. అరెస్ట్ సమయంలో శరణ్ ఫోన్ చేసి పరిశీలించక అందులో సౌత్ లాబీకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ని గుర్తించినట్లు తెలిపింది. దీంతో మీడియా తన మీద దృష్టి పెట్టింది. ఈరోజు ఒకవైపు కోర్టులో వాదనలు వింటున్న టైం లో మరోవైపు శరణ్ నివారసం లో రైడ్స్ ని నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news