విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి మిస్సింగ్ కేసులో ట్విస్ట్

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి మిస్సింగ్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చనిపోతున్నానని సూసైడ్ లేఖ రాయడం అంతా బూటకం అని తేల్చారు పోలీసులు. పలువురి వద్ద ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ శ్రీనివాస్ 50 లక్షలు తీసుకున్నాడు అని పోలీసులు చెబుతున్నారు. అలానే శ్రీనివాస్ కి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని గుర్తించామని చెబుతున్నారు.

ఆర్ఎన్ఐఎల్ కి డబ్బు కట్టినట్టు ఫేక్ డీడీలు చూపించారని బాధితుల ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయని విశాఖ సౌత్ జోన్ డీజీపీ పెంటారావు పేర్కొన్నారు. నిజానికి ఆయన  ఆదివారం రాత్రి పది గంటల సమయంలో విధులకు హాజరయ్యారు. ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ప్లాంట్ లాగ్ బుక్ లో రాశాడు. ఆ తర్వాత మాయమైపోయాడు. అయితే అతడి అదృశ్యంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. అసలేం జరిగిందనే అంశం మీద ఆరా తీశారు. ఈ క్రమంలో ఈ సంచలన నిజాలను పోలీసులు కనుక్కున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news