ట్విట్టర్ జనాలు ఎక్కువగా మాట్లాడుకోవాలంటే.. సెలబ్రిటీస్ ఏం చేయాలి? హిట్స్ లేకపోయినా ఫర్వాలేదు. ఒక్కోసారి సక్సెస్‌తో సంబంధం వుండదు. అందుకేనేమో.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఫిఫ్త్ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్‌ను నెటిజన్లు మర్చిపోయారు. ట్విట్టర్ వేదికగా 2020లో ఎక్కువ మంది ఏయే హీరోయిన్స్ గురించి చర్చించుకున్నారు? దీని ప్రకారం లెక్కలు కట్టి.. టాప్ 10లో వున్న ఆ సౌత్ ఇండియా భామలను ఎనౌన్స్‌చేశారు.
తెలుగులో రెండేళ్లుగా ఎక్కువ వినిపిస్తున్న పేరు పూజా హెగ్డే. అరవింద సమేత వీర రాఘవ.. మహర్షి.. గద్దల కొండ గణేష్.. అల వైకుంఠపురంలో. ఇలా వరుసగా నాలుగు హిట్స్ కొట్టి.. రెమ్యునరేషన్ పెంచేసింది. ఈ అమ్మడు డేట్స్ కావాలంటే.. రెండున్నర కోట్లు ఇవ్వాల్సిందే. అల వైకుంఠపురంలోతో అదిరిపోయే హిట్ కొట్టిన ఈ అమ్మడు ట్విట్టర్‌లో మాత్రం ఐదో ప్లేస్‌లో వుంది. ట్విట్టర్‌లో ఎక్కువ మంది మాట్లాడుకున్న హీరోయిన్‌గా టాప్ త్రీలో ఈ అమ్మడు లేకపోవడంపై చర్చించుకుంటున్నారు పూజా ఫ్యాన్స్
కీర్తిసురేష్‌కు సరైన హిట్ లేకపోయినా.. ట్విట్టర్ తన గురించే మాట్లాడుకునేలా చేసింది. ముఖ్యంగా మహానటితో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది కీర్తి. కరోనా టైంలో సందడంతా ఈ అమ్మడిదే. లాక్‌డౌన్ టైంలో ఈ అమ్మడు నటించిన మిస్ ఇండియా.. పెంగ్విన్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అలాగే.. సర్కారువారిపాటలో మహేశ్‌తో.. ‘అన్నాత్తైలో రజనీకాంత్‌తో జత కట్టే ఛాన్స్ అందుకోవడంతో మోస్ట్ టాక్డ్ యాక్ట్రెస్‌గా నిలిచింది కీర్తి.
స్టార్ హీరోల పక్కన నటించే చాన్స్ దక్కకపోయినా.. కంటిన్యూస్ ఫ్లాప్స్‌తో కాజల్‌కు పెద్దగా క్రేజ్ లేదు. ఫేడౌట్ అయిపోయిందనుకున్న చందమామకు చిరంజీవి పిలిచి ఆచార్యలో ఛాన్స్ ఇచ్చాడు. రీసెంట్‌గా చేసుకున్న పెళ్లి .. హనీమూన్ ట్రిప్‌తో కాజల్ టాపిక్ ట్విట్టర్‌లో వెల్లువలా నడిచింది సెకండ్ ప్లేస్ కొట్టేసింది.
సరిలేరునీకెవ్వరు.. భీష్మ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత రష్మిక మందాన్నాకు క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుండే రష్మికకు నాలుగో ప్లేస్ దక్కింది. తాప్సి.. తమన్నా…రకుల్.. శృతి.. త్రిష 6 నుంచి 10 స్థానాలు ఆక్రమించారు. సౌత్ ఇండియాలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నయనతార గురించి ట్విట్టర్‌లో పెద్దగా టాపిక్ రాలేదు. విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం సాగిస్తున్నా.. నెటిజన్లు లైట్‌గా తీసుకున్నారు. అనుష్క నటించిన నిశ్శబ్దం రిలీజ్ అయినా.. ఓటీటీలో చడీ చప్పుడు లేకుండా వచ్చి వెళ్లి పోయింది.
జానాలు ఎక్కువగా మాట్లాడుకోవాలంటే.. సక్సెస్ ఒక్కటే కారణమని చెప్పలేం. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుండాలి. సక్సెస్‌లో వుండాలి. లేదంటే.. కాంట్రవర్సీలన్నా చేయాలి. వీటన్నింటికీ సీనియర్ హీరోయిన్స్ అనుష్క, నయన దూరంగా వుండడంతో.. వీళ్ల గురించి చర్చ జరగలేదు… టాప్ టెన్‌లో స్థానం లేకుండా పోయింది.