‘బిగ్ బాస్’ ఓటీటీ తెలుగు షో ఆరోవారం రసవత్తరంగా సాగింది. ఎట్టకేలకు హోస్ట్ నాగార్జున చెప్పినట్లు హౌజ్ నుంచి ఇద్దరి ఎలిమినేషన్ జరిగింది. డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని నాగార్జున ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే ఈ సారి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ జరిగింది. అయితే, వీరిరువురు కూడా తమ ఎలిమినేషన్ సందర్భంగా హుందాగానే వ్యవహరించడం గమనార్హం.
శ్రవంతిని తొలుత ఎలిమినేట్ చేయగా, తనకు ఎటువంటి భయాలు లేవని ఆనందంగానే వెళ్తానని తెలిపింది శ్రవంతి. ఈ క్రమంలోనే తాను అక్కగా అఖిల్, అజయ్ లను ప్రేమిస్తానని పేర్కొంది. అలా శ్రవంతి హుందాగానే వ్యవహరించింది. ముమైత్ ఖాన్ పేరు సెకండ్ ఎలిమినేషన్‌లో భాగంగా తెరమీదకు వచ్చింది. ముమైత్ సైతం ఎలిమినేషన్ కు రెడీ అయిపోయింది.
వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఖాన్.. ఆరో వారంలో బయటకు వచ్చేసింది. అయితే, తాను హౌజ్ లో ఉన్నా బయటకు వచ్చినా గేమ్ గురించి ఎటువంటి రిగ్రెట్స్ లేవని చెప్పింది. ఈ క్రమంలోనే బిందు ఒకరితో జాగ్రత్తగా ఉండాలంటే అది ఎవరు? అని నాగార్జున ప్రశ్నించగా, శివ పేరు చెప్పింది.
అలా బిందు మాధవి-శివల ఫ్రెండ్ షిప్ ను గురించి ప్రస్తావిస్తూనే, బిందు జాగ్రత్తగా ఉండాలని సూచించింది ముమైత్ ఖాన్. అలా ‘బిగ్ బాస్’ నుంచి ఆదివారం ‘బిగ్ న్యూస్’ అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఇద్దరు కంటెస్టెంట్స్ హౌజ్ నుంచి బయటకు వచ్చేశారు. ఇక కమింగ్ డేస్ లో గేమ్ మరింత టఫ్ అయ్యే చాన్సెస్ ఉంటాయి.