తేనె టీగల దాడిలో..కోట్ల విలువైన రెండు గుర్రాలు మృతి..

-

ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఒక డైలాగ్‌ పేమస్‌ అవుతోంది.. అబ్బాయి కత్తిలా ఉన్నాడు కదవే అంటే.. వెనక నుంచి …వాళ్ల అమ్మ కత్తిపీటలా ఉంటుంది అని వాయిస్‌ వస్తుంది.. ఈ డైలాగ్‌ తేనె టీగలకు బాగా సెట్‌ అవుతుంది. తేనె తియ్యగా ఉంటుంది కానీ.. తేనెటీగలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. సాధారణంగా ఇవి వాటి పని అవి చేసుకుంటాయి.. ఎవరైనా వాటి జోలికి వెళ్తే మాత్రం ఇచ్చిపడేస్తాయి.. తేనెటీగల దాడిలో గాయపడిన వాళ్లను చూసి ఉంటాం..కానీ.. కర్ణాటకలో హనీబీస్‌ దాడిలో..కోట్ల విలువైన గుర్రాలు చనిపోయాయి.

కర్ణాటక తుమకూరు జిల్లాలోని కునిగల్ పట్టణంలో.. తేనెటీగల దాడి చేయడంతో రెండు గుర్రాలు చనిపోయాయి. అవి రేస్ గుర్రాలు. అందులోనూ పాపులర్ బ్రీడ్. వాటిలో ఒకదాని వయసు 10 ఏళ్లు, మరొకదాని వయస్సు 15 ఏళ్లు. వాటిని ఐర్లాండ్, అమెరికా నుంచి రూ.2 కోట్లు పెట్టి ఆరు నెలల కిందట దిగుమతి చేసుకున్నారట. ఈ ఘటన గురువారం జరిగింది. ఫామ్‌లో గడ్డి మేస్తాయని.. గుర్రాలను వదిలిపెట్టారు. అయితే.. అవి తేనెటీగలు ఉన్నచోటికి వెళ్లి.. అక్కడి మొక్కలను కదిపాయి. దాంతో తేనెటీగలు ఒక్కసారిగా గుంపుగా ఎటాక్ చేశాయి.. రెండు గుర్రాలను ఇష్టమొచ్చినట్లు కుట్టేశాయి. తేనెటీగ ముల్లు గుచ్చుకుంటే.. విపరీతమైన నొప్పి ఉంటుంది. ఆ నొప్పి కొన్ని గంటలపాటూ ఉంటుంది. ఆ గుర్రాలను అన్ని తేనెటీగలు కుట్టడంతో అవి నొప్పిని భరించలేకపోయాయి.

వెటెర్నరీ డాక్టర్ల టీమ్ అక్కడికి వెళ్లి ట్రీట్‌మెంట్ చేసింది..ఇలా రెండ్రోజులు ప్రయత్నించినా ఫలితం లేదు.. విలువైన రేస్ గుర్రాల్లో ఒకటి గురువారం రాత్రి చనిపోగా.. మరొకటి శుక్రవారం ఉదయం చనిపోయింది. ఈ గుర్రాలను ఈ జాతి సంతతిని పెంచేందుకు తీసుకొచ్చారు. కానీ పాపం ఇలా అయిపోయింది.. ఫామ్‌ దగ్గర్లో తేనెటీగలను గుర్తించినప్పుడే వాటిని తీసేసేయాల్సింది..మీరు కూడా పశువులను పెంచే ప్లేస్‌లో ఇలాంటివి ఉన్నాయేమో ఒకసారి చెక్‌ చేసుకోండి..! మూగజీవులు తేనెటీగలు దాడి చేస్తున్నా ఏం చేయలేవు.. మనలా గట్టిగా అరవడమో, పారిపోవడమో వాటికి తెలియదు..!

Read more RELATED
Recommended to you

Latest news