కొన్ని పేపర్లకి పైన వెలుగు ఉన్నా లోపల చీకటి ఉంటుంది – కల్వకుంట్ల కవిత

-

సమాజంలో వార్తల మీద విశ్వాసం కోల్పోయే సమయం వచ్చిందని.. ఇది బాధకరమైన విషయమని అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మా పేపర్ నమస్తే తెలంగాణ.. మా న్యూస్ Tన్యూస్.. మాది తెలంగాణ వాదం అన్నారు. కానీ కొన్ని పేపర్లకి పెరు ఉండదు, ఊరు ఉండదు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తారని ఆరోపించారు. కొన్ని పేపర్లకి పైన వెలుగు ఉన్నా లోపల చీకటి ఉంటుందన్నారు. మోడీ ప్రధాని అయ్యి 9 సంవత్సరాలు అవుతుందని.. కానీ ఇప్పటివరకు ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టలేదన్నారు.

ఒక్క సారి కూడా జర్నలిస్ట్ మిత్రులను కలవలేదన్నారు. కానీ మా ముఖ్యమంత్రి 300 మంది జర్నలిస్టులతో సమావేశం పెడుతారని.. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతారని అన్నారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఇప్పుడు భారతదేశంలో కనుమరుగు అయ్యిందని కీలక వ్యాఖ్యలు చేశారు. మేము మా జర్నలిస్టుల కోసం 100 కోట్లు కేటాయించామని.. దమ్ముంటే మోడీ కూడా కేటాయించాలన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం ఎమ్మెల్యేలను కలుస్తున్నారని.. తప్పకుండా జర్నలిస్టుల ఇళ్ల సమస్యను సీఎం దగ్గరికి తీసుకెళ్తానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news