ఐపీఎల్ 2021 రెండో సీజన్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నీలో.. 37 మ్యాచ్ లు పూర్తి కాగా… ఇవాళ మరో రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. ఐపీఎల్ టోర్నీలో… ఇవాళ రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. అబుదాది వేదికగా చెన్నై సూపర్ సింగ్స్‌తో, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు మొదటి మ్యాచ్ లో తలపడనుండగా …రెండో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య దుబాయి వేదికగా మ్యాచ్ జరగనుంది.
పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై ఈ మ్యాచ్ గెలిచి ఫ్లే ఆఫ్‌కు మరింత చేరువ అయ్యేందకు ప్రయత్నిస్తుంది. గత మ్యాచ్‌లో ఓటమి పాలైన కోల్‌కతా ఈ సారి ఎలగైనా గెలవాలనే పట్టదలతో ఉంది. ఇక ముంబై, బెంగుళూరు చెరో 8 పాయింట్లతో ఉండగా… ఫ్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు రెండు టీంల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. కాగా.. మొదటి మ్యాచ్ 3.30 గంటలకు ప్రారంభం కానుండగా.. రెండో 7.30 గంటలకు ప్రారంభం కానుంది.