ఇండియాలో తగ్గుతున్న కరోనా.. ఇవాళ 28,326 కేసులు

-

ఇండియాలో కరోనా ఉదృతి రోజు రోజు కు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. ఈ రోజు కొత్తగా దేశం లో 28,326 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా మొత్తం 26,032 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇక దేశంలో ప్రస్తుతం యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,03,476 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.19 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 260 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4, 46, 918 కి చేరింది. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,29,02,351 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 85,60,81,527 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

ఇక గడిచిన 24 గంటల్లో 68,42,786 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. కాగా.. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయ వంతంగా కొన సాగుతోంది. ఇప్పటికే 85 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేసింది కేంద్ర ఆరోగ్య సంస్థ. డిసెంబర్‌ నాటికి పూర్తి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని యోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version