మనం పల్లెటూరు లలో చూస్తూ ఉంటాం. బిందె నీళ్ల కోసం నీళ్ల ట్యాంక్ వద్ద ఆడవాళ్లు కొట్టుకుంటూ ఉంటారు. అయితే ఆస్ట్రేలియా లో కూడా ఇద్దరు మహిళలు కొట్టుకున్నారు. అయితే ఎదో నీళ్ల కోసమే లేదంటే ఒక వస్తువు కోసమో కాదు కేవలం ఒక టిష్యు రోల్ కోసం ఇద్దరు మహిళలు జుట్టు జుట్టు పట్టుకొని మరి కొట్టుకున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియా లోని న్యూ సౌత్ వేల్స్ లోని ఒక సూపర్ మార్కెట్ లో చోటుచేసుకుంది. దీనితో ఆ మహిలు ఇద్దరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. వారిలో ఒకరి వయస్సు 23 ఏళ్లు కాగా మరొకరి వయస్సు 60 ఏళ్లు గా తెలుస్తుంది. అయితే ఆ మహిళలు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకుంది కరోనా పుణ్యమేనట. ఈ కరోనా పేరుతో మరణాలు సంభవించడమే కాకుండా ఇలా మహిళల మధ్య గొడవలు కూడా సృష్టిస్తుంది. అసలు కరోనా కు వారి గొడవకు సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా. వివరాల్లోకి వెళితే…. ఆస్ట్రేలియా ప్రభుత్వం టాయిలెట్ పేపర్లను చైనా లాంటి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు కరోనా ఏడిపిస్తుండడం తో అధికారులుటాయిలెట్ టిష్యు దిగుమతి తగ్గొచ్చు అన్న ఉద్దేశ్యం తో ముందస్తు చర్యలుగా సూపర్ మార్కెట్లలో ఒక్కో వ్యక్తికీ ఒక ప్యాకెట్ మాత్రమే అమ్ముతున్నారు. ఐతే ప్రజలు మాత్రం ఎక్కువెక్కువ కావాలంటూ ఎక్కడ టాయిలెట్ పేపర్లు ఉన్నా అమాంతం వెళ్లి కొనేస్తున్నారు. మున్ముందు దొరకవేమో అని ఇప్పుడే కంగారుపడిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓ సూపర్ మార్కెట్‌లో ఓ యువతి తన ట్రాలీ నిండా టాయిలెట్ పేపర్ బండిల్స్ ప్యాకెట్లను నింపేసుకుంది. అయితే ఇంతలో ఒక 60 ఏళ్ల మహిళ వచ్చి అందులోంచీ తనకు ఓ ప్యాకెట్ ఇమ్మని ఆ యువతిని కోరింది.
దీనికి ఆ యువతి ఒప్పుకోలేదు. ముందు నేను తీసుకున్నాను కాబట్టి అవి నావే అంటూ సమాధానం చెప్పింది. దీనితో 60 ఏళ్ల మహిళ వాగ్విదానికి దిగింది. ఒక మనిషికి ఒక ప్యాకెట్టే కాబట్టి నాకో ప్యాకెట్ ఇవ్వాల్సిందే అంటూ ఆమె పట్టు బట్టింది. దీనితో ఆ యువతి ఆ పెద్దావిడ తో గొడవకు దిగడం తో ఇద్దరి మధ్య గొడవ పెద్దది అయ్యి చివరికి కొట్టుకొనే పరిస్థితి వచ్చింది. అయితే ఇంతలో మరో మహిళ కూడా వచ్చి గొడవకు దిగడం తో అక్కడ అది పెద్ద హాట్ మ్యాటర్ అయ్యింది. దీనితో పోలీసులు రంగంలోకి దిగి ఆ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరిని కోర్టు ముందు ఏప్రిల్ 28 న హాజరు పరచాలి అంటూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. కేవలం ఒక టిష్యు కోసం ఇంతలా పోలీసు కేసు అయ్యేవరకు వారిద్దరూ ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యం కలిగింది. మొత్తానికి కరోనా పుణ్యమా అని ఇలాంటి గోడలు కూడా మొదలవుతున్నాయి.