INDIA vs NEWZEALAND : రోహిత్ పేరిట మ‌రో రెండు రికార్డులు

-

న్యూజిలాండ్ తో ఆడుతున్న మూడో టీ ట్వంటి లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రికార్డుల‌ను కొల్ల‌గొడుతున్నాడు. నేటి మ్యాచ్ లో టాస్ నెగ్గి టీమిండియా మొద‌ట బ్యాటింగ్ చేస్తుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ ఆకాశ‌మే హ‌ద్దు గా చెల‌రేగిపోతున్నాడు. తాజా రెండు స‌రి కొత్త రికార్డుల‌ను తన పేరిట లిఖించుకున్నాడు. ఓపెనింగ్ చేస్తున్న రోహిత్ శ‌ర్మ సిక్స్ ల‌తో రెచ్చి పోయారు. దీంతో అంత‌ర్జాతీయ టీ 20 మ్యాచ్ లో 150 సిక్స్ లు బాధిన తొలి ఆసియా క్రికెటర్ గా రోహిత్ రికార్డు సృష్టించాడు.

అలాగే ప్ర‌పంచ వ్యాప్తం గా రెండో స్థానంలో ఉన్నాడు. మొద‌టి స్థానం లో 161 సిక్స్ ల‌తో న్యూజిలాండ్ ఆట‌గాడు మార్టిన్ గ‌ప్టిల్ ఉన్నాడు. అలాగే రోహిత్ శ‌ర్మ త‌ర్వాత వెస్ట్ండిస్ విధ్వంస‌క ఆట‌గాడు క్రిస్ గేల్ 124 సిక్స్ ల‌తో మూడో స్థానం లో ఉన్నాడు. అలాగే అంత‌ర్జాతీయ టీ 20 ల‌లో ఎక్కువ సార్లు అర్థ శ‌త‌కాల క‌న్న ఎక్కువ స్కోర్ చేసిన ఆట‌గాడి గా ప్ర‌పంచ రికార్డు ను త‌న పేరిట రాసుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు టీమిండియా మాజీ ఆట‌గాడు విరాట్ కోహ్లి పై ఉంది. విరాట్ కోహ్లి ఇప్ప‌టి వ‌ర‌కు 29 సార్లు 50 క‌న్న ఎక్కువ ర‌న్స్ చేశాడు. రోహిత్ శ‌ర్మ నేటి మ్యాచ్ తో 30 సార్లు 50 క‌న్న ఎక్కువ ప‌రుగులు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news