వైరల్ : వేలాడుతూ విమానంలోనే ఆఫ్ఘన్ ప్రజల ప్రయాణం

-

కాబూల్ ఎయిర్ పోర్టు లో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. దేశాన్ని వదిలి వెళ్లే క్రమంలో… కాబుల్ ఎయిర్ పోర్ట్ కు చేరుకొని విమానాల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాబూల్ ఎయిర్ పోర్టు కు… ఓ ఎయిర్ ఫోర్స్ విమానం రాగా… రన్వేపై కదులుతున్న ఆ విమానం ఎక్కారు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు.

విమానం డోర్ క్లోజ్ చేసిన కూడా వేలాడుతూ ప్లేన్ లోనే ప్రయాణం చేస్తున్నారు ప్రజలు. అయితే ఈ నేపథ్యంలో ఆకాశంలో ఎగురుతున్న ప్లే నుంచి కొంతమంది వ్యక్తులు కింద పడ్డారు. ప్రస్తుతం ఈ ఎయిర్ పోర్టు ఘటనకు సంబంధించి… ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే… ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఏ మేరకు నరకయాతన అనుభవిస్తున్నారనేది అర్థమవుతుంది. ఇక మరోవైపు హమీద్ కర్జాయి ఎయిర్ పోర్ట్ నుండి ఐదుగురు ని తీసుకువెళ్లి తాలిబన్లు హతమార్చినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news