కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ల పేర్లు ఖరారయ్యాయి అని తెలుస్తోంది. రామ్మోహన్ నాయుడికి కేంద్ర కేబినెట్ హోదా, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఖరారైనట్లు ఢిల్లీ వర్గాలు తెలిపాయి.
కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ తన స్థానాల్ని డబుల్ చేసుకోగా.. ఆంధ్ర ప్రదేశ్ లోనూ కూటమి ద్వారా మంచి ఫలితాన్నే రాబట్టగలిగింది. ఎన్డీయే భాగస్వామి పక్షాల అధినేతలతో విడివిడిగా శుక్రవారం అమిత్ షా,జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు అవకాశం లభించింది. అయితే వీరికి కేంద్రంలో ఏ శాఖ దక్కనుందనే సమాచారం మాత్రం ఇంకా ఇప్పటికి తెలియదు. ఇక ఈ విషయంపై ఉత్కంఠ నెలకొంది
.