ఇండియా,, పాకిస్థాన్ మ్యాచ్ కు మరి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. 2024 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా రేపు (జూన్ 9) దాయాధి దేశాల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న భారత్ ఫేవరేట్ గా దిగుతుంటే.. అమెరికాతో ఓటమి తర్వాత పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే… పాక్ మాజీ క్రికెటర్ టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని ఓపెనర్ గా పంపి మేనేజ్మెంట్ తప్పు చేస్తోందని పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అతడిని మూడో స్థానంలోనే బ్యాటింగ్కు పంపాలని అభిప్రాయపడ్డారు. ‘కోహ్లి ఓపెనర్ గా వచ్చి త్వరగా ఔటైతే భారత్ ఓడిపోయే అవకాశం ఉంది. మూడో స్థానంలో దిగితే ఒత్తిడికి లోనవకుండా జట్టు గెలిచేవరకూ క్రీజులోనే ఉంటారు. కోహ్లి ఓపెనింగ్ స్థానాన్ని వదులుకోవాలి’ అని ఆయన సూచించారు.