జపం ఎన్ని రకాలో తెలుసా?

-

జపం.. మనం ఉపదేశం తీసుకున్న మంత్రాన్ని లేదా వంశపరంపరగా వస్తున్న మంత్రాన్ని ఏకాగ్రతతో ఒక నిశ్చలమైన పద్ధతిలో చేసే ప్రక్రియను సూక్ష్మంగా జపం అని చెప్పుకోవచ్చు. అది మనం చేసే విధానాన్ని బట్టి కింది విధాలుగా పేర్కొన్నాయి శాస్ర్తాలు. అవి…

వాచింకం
మంత్రబీజాక్షరాలను తన చుట్టూ ఉన్నవారికి వినిపించేటట్లు పలుకుతూ జపం చేయడం వాచికం అనబడుతుంది.

ఉపాంశువు
తనకు అత్యంత సమీపంలో ఉన్నవారికి మాత్రమే వినిపించేటట్లు పెదవులను కదుపుతూ జపం చేయడం ఉపాంశువు అని పిలువబడుతుంది.

మానసికం
మనస్సులోనే మంత్రాన్ని జపించడం.
పై మూడు విధాలలో వాచిక జపం కంటే ఉపాంశు జపం 100 రేట్లు ఫలితాన్ని కలిగిస్తూ ఉండగా, ఉపాంశుజపం కంటే మానసిక జపం 1000 రేట్లు ఫలితాన్ని కలిగిస్తుంటుంది. అయితే, జపం చేసేటప్పుడు అక్షరం, అక్షరం విడివిడిగా వల్లించుకుంటూ జపం చేయకూడదు. అలాగని మరింత వేగంగా కూడా చేయకూడదు. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. జపంలో ఉఛ్చారణ చేస్తున్నప్పుడు బీజాక్షరాలు లోపించకూడదు. జపానికి ముందుగానీ, తరువాత గానీ ఇష్ట దేవతా పూజ తప్పకుండా చేయాలి. పూజ చేయని జపం ఫలితాన్ని ఇవ్వదని శాస్త్రం చెబుతోంది. జపం చేసేందుకై కొంతమంది భక్తులు జపమాలలను ఉపయోగిస్తుంటారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news