దుబాయ్: నిషేదిత ప్రయాణాల లిస్టులో ఇండియా.. ఎప్పటి వరకంటే,

-

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరో మారు విమాన ప్రయాన రాకపోకల నియమాలను సవరించింది. ప్రస్తుతానికి 14దేశాలకు నిషేధం విధించింది. అందులో ఇండియా కూడా ఉంది. జులై 21వ తేదీ వరకు ఈ నిషేధం ఉండనుంది. అప్పటి వరకు దుబాయ్ నుండి రావడానికి, పోవడానికి అవకాశం లేదు. మొత్తం 14దేశాల్లో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, లిబేరియా, నమీబియా, సిరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో, జాంబియా, వియత్నాం, నేపాల్, శ్రీలంక, నైజీరియా, దక్షిణాఫ్రికా ఉన్నాయి.

ఈ 14దేశాల నుండి దుబాయ్ కి అనుమతి లేదు. ఈ మేరకు దుబాయ్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ పేర్కొంది. ఐతే కార్కో విమానాలకు మాత్రం అనుమతి ఉంది. కరోనా కారణంగా ఈ 14దేశాల విమానాలకు దుబాయ్ నిషేధం విధించింది. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసులు భారీగా తగ్గినప్పటికీ, డెల్టా ప్లస్ వేరియంట్ భయం ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news