శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి అమిత్ షా కుమారుడు జయ్షా కారణంగానే ఇండియా ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో ఓడిందని విమర్శించారు.బ్యాట్ కూడా పట్టడం రాని జయ్ షాను బీసీసీఐ కార్యదర్శిని చేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఇది బీజేపీలో బంధుప్రీతికి నిదర్శనం కాదా అని ఆయన ప్రశ్నించారు. సాంగ్లీలో జరగిన శివసేన బహిరంగ సభకి హాజరు అయినారు.
ఈ సందర్భంగా ఉద్ధవ్ థాకరే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ లోక్ మహారాష్ట్ర రాజకీయ నేతలు హాట్ హాట్ కామెంట్లు చేస్తున్నారు.థాకరే చేసిన వ్యాఖ్యలు జయ్ షాను టార్గెట్ చేయడంతో రెండు పార్టీల మధ్య మాటల యుధ్దానికి దారి తీసింది. శివసేన పార్టీలో చీలిక కొందరి దురుద్దేశంతో జరిగిందని ఉద్దవ్ అన్నారు. ఉద్దవ్ థాకరే .. జయ్ షా పేరును ఉపయోగించడం ఇదే మొదటిది కాదు. గతంలో చాలా సార్లు ఆయనపై విమర్శలు చేసినారు.