భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 24, 25 రెండు రోజుల్లో హోలీ పండుగ రావడంతో.. పలు ప్రాంతాల ప్రజలు ఆదివారం హోలీని జరుపుకోగా..తెలుగు రాష్ట్రాల ప్రజలు సోమవారం జరుపుకోనున్నారు.
దీంతో ప్రధాని మోడీ తన ట్విట్టర్ ద్వారా.. “దేశంలోని నా కుటుంబ సభ్యులందరికీ హోలీ శుభాకాంక్షలు. ఆప్యాయత, సామరస్యం యొక్క రంగులతో అలంకరించబడిన ఈ సంప్రదాయ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త శక్తిని, కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది.” అని ప్రధాని ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.
.