మహారాష్ట్ర సిఎం ఉద్దావ్ థాకరే తన సిఎం పదవిని కాపాడుకోవడానికి గానూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు ఆయన ప్రధాని నరేంద్ర మోడికి ఫోన్ చేసారు. తన సిఎం పదవిని బిజెపి టార్గెట్ చేసిందని ఈ సమయంలో రాజకీయాలు కరెక్ట్ కాదని ఆయన కోరారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో రాజకీయ సంక్షోభం కరెక్ట్ కాదని దీని గురించి ఆలోచించాలి అని ప్రధానికి విజ్ఞప్తి చేసారు.
కాగా ఆయన గత ఏడాది నవంబర్ 28 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అప్పుడు ఆయన శాసన సభలో గాని శాసన మండలి లో గాని సభ్యులుగా లేని సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన గవర్నర్ కోటాలో మండలికి పంపాలని కేబినేట్ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారిని కోరినా సరే ఫలితం లేకుండా పోయింది. ఆయన దీనిపై ఏమీ స్పందించడం లేదు. దీనితో ఉద్దావ్ ఎం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఉద్ధవ్ ఠాక్రేను రాష్ట్ర శాసనమండలికి నామినేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసుపై కోశ్యారీ ఇంకా స్పందించలేదు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం గవర్నర్‌ను త్వరగా నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.