UGC నెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల… వివరాలు ఇవే..!

-

జూనియర్ రిసెర్చ్ ఫెలో షిప్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా UGC-NET పరీక్షలను నిర్వహిస్తోంది అన్న సంగతి మనకి తెలిసినదే. ఈ ఏడాది జరగబోయే యూజీసీ నెట్ పరీక్షలకి సంబంధించి పలు విషయాలని విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్షల కోసం పలు వివరాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ మంగళవారం చెప్పడం జరిగింది. ఇక అసల విషయం లోకి వస్తే….

ఫోఖ్రియాల్ ట్విట్ లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 2 నుంచి 17 వరకు పరీక్షలను నిర్వహిస్తుందని చెప్పారు. అలానే జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత కోసం సబ్జెక్టుల వారీగా మే 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14, 17 తేదీల్లో ఉండనున్నాయి. అయితే ఈ పరీక్షలు మొత్తం 11 రోజుల పాటు దేశ వ్యాప్తంగా జరగనున్నాయి అని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ వెల్లడించారు.

అలానే ట్వీట్ లో పరీక్షలని వ్రాసే అభ్యర్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఇది ఇలా ఉండగా ఈ పరీక్షలు ఆన్‌లైన్ పద్ధతి లో జరగనున్నాయి. ఈ యూజీసీ నెట్ పరీక్ష 2021 కు సంబంధించి ఏమైనా వివరాలని మీరు తెలుసుకోవాలంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news