మొబైల్స్ తయారీదారు పోకో కొత్తగా పోకో ఎం3 పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో మంగళవారం విడుదల చేసింది. ఇందులో 6.53 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డాట్ డ్రాప్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్‌లను ఇందులో అందిస్తున్నారు. దీంట్లో వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్లను ఏర్పాటు చేశారు. 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
ఈ ఫోన్లో యాంటీ ఫింగర్ ప్రింట్ లెదర్ లైక్ ఫినిష్ను ఇచ్చారు. అందువల్ల ఫోన్‌ను పట్టుకుంటే అంత త్వరగా ఫింగర్ ప్రింట్స్ పడవు. ఈ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో ఇచ్చారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
పోకో ఎం3 ఫీచర్లు…
* 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 2340 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
* 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్
* 48, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్
* డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0 యూఎస్బీ టైప్ సి
* 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
పోకో ఎం3 స్మార్ట్ ఫోన్ కూల్ బ్లూ, పవర్ బ్లాక్, పోకో ఎల్లో కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తారు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో ఈ ఫోన్‌పై రూ.1000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తారు.