కరోనా వైరస్ కారణంగా మే నెలలో జరగాల్సిన యూజీసీ నెట్ పరీక్ష వాయిదా వేశారు. ఈ విషయాన్ని సెంట్రల్ మినిస్టర్ Ramesh Pokhriyal Nishank తెలియజేశారు. తాజాగా ఆయన ట్వీట్ చేసి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. దీనితో పరీక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది. యూజీసీ నెట్ 2, 3, 4, 5, 6, 7, 10, 12, 14 మరియు 17 మే 2021 న జరగాల్సి ఉంది.
కానీ కరోనా వైరస్ తీవ్రంగా ఉండడం తో పరీక్ష వాయిదా పడింది. పరీక్ష తేదీలని పరీక్షలకి 15 రోజుల ముందు చెప్తాము అని ఆయన చెప్పడం జరిగింది. అయితే యూజీసీ నెట్ కి అప్లై చేసిన వాళ్ళు వెబ్సైట్ లో చెక్ చేసుకుంటూ ఉండడం మంచిది. ugcnet.nta.nic.in ఇది అఫీషియల్ లింక్.
యూజీసీ నెట్ పరీక్ష అంటే ఏమిటి..?
జూనియర్ ప్రొఫెసర్ ఫెలోషిప్‌లు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల కోసం యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ (యుజిసి) యొక్క జాతీయ అర్హత పరీక్ష (నెట్) దేశ వ్యాప్తంగా విశ్వ విద్యాలయాలు మరియు ఇతర ఉన్నత విద్యా సంస్థల లో నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం రెండు సార్లు ఈ పరీక్షలు ఉంటాయి సాధారణంగా జూన్ మరియు డిసెంబర్ లో వీటిని కండక్ట్ చేస్తారు కానీ ఈసారి కరోనా కారణంగా ఇవి జరగడం లేదు.