ఆధార్ అప్డేట్ గడువు పొడిగించిన UIDAI…. ఎప్పటి వరకు అంటే..?

-

UIDAI కీలక ప్రకటన చేసింది.ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు మరో అవకాశం కల్పించింది.ఆధార్ అప్డేట్ గడువు పొడిగిస్తున్నట్లు UIDAI ప్రకటించింది. ఆధార్ కార్డు ఉన్నవారు 2024 జూన్ 14 వరకు ఉచితంగా మార్పులు చేసుకోవచ్చని తెలిపింది.

ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన కారణంగా ఈ ఉచిత అప్డేట్ సర్వీసులను మరో 3 నెలల పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు యూఐడీఏఐ తెలిపింది.myAadhaar పోర్టల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ప్రజలంతా తమ ఆధార్ కార్డుల్లో ఏవైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.ఇదివరకు ….2023, డిసెంబర్ 15వ తేదీ నుంచి 2024, మార్చి 14వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే.ఆధార్ కార్డులో ఏదైనా తప్పులుంటే దానిని ఉచితంగా ఇంటి నుంచే అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని కలిగించింది. అలాగే ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు దాటినట్లు అయితే మీ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news