నాలుగు గొడల మధ్య జరగాల్సిన విచారణ ఇక ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ లో…ఎక్కడో తెలుసా!!

-

నాలుగు గోడల మధ్య జరగాల్సిన విచారణ ఇక ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఇంగ్లాండ్ లోని వేల్స్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. విడాకుల విచారణ చరిత్ర లో ఇంగ్లాండ్ లోని వేల్స్ కోర్టులు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే దీనిపై ఒకవేళ జంటలు గనుక అభ్యంతరం తెలిపితే మాత్రం వారి కేసు లైవ్ స్ట్రీమింగ్ ను నిలుపుదల చేయవచ్చు అన్నమాట. న్యాయవ్యవస్థపై ప్రజలకు అవగాహన పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని.ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్వీట్టర్‌ల ద్వారా కోర్ట్ ఆఫ్ అప్పీల్‌ విచారణనలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు న్యాయశాఖ వెల్లడించింది.కేసు విచారణలు టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరగదు.ఎలాంటి కేసులను లైవ్ స్ట్రీమింగ్‌కు ఇవ్వాలో అనుమతించే అధికారం న్యాయమూర్తులకు ఉంటుంది.ఒక వేళ జంట గనుక అభ్యంతరం వ్యక్తం చేస్తే మాత్రం కేవలం ఆ జంట,న్యాయమూర్తిబెంచ్,న్యాయవాదులు మాత్రమే వీక్షించే అవకాశం కల్పిస్తారు.

విడాకులు కోరుతున్న దంపతులు, సంరక్షణ చర్యలలో ఉన్న కుటుంబాలను ఎట్టి పరిస్ధితుల్లో చిత్రీకరణకు అనుమతించరు.కుటుంబ కేసుల యొక్క సున్నితత్వం కారణంగా వారి వివరాలను బయటకు కూడా వెల్లడించరట. ప్రత్యక్ష ప్రసారాలకు ముందు వాద ప్రతివాదులకు ముందుగానే సమాచారం కూడా ఇస్తారు, ఒకవేళ అభ్యంతరాలు ఉంటే వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లవచ్చు. నామినేటేడ్ కేసులను న్యాయవ్యవస్థ వెబ్‌సైట్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news