ఉక్రెయిన్ విద్యార్థులతో ఢిల్లీ చేరిన 11 వ విమానం… స్వాగతం పలికిన కేంద్ర మంత్రి

-

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను ‘ఆపరేషన్ గంగ’ ద్వారా స్వదేశానికి తీసుకువస్తున్నారు. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయును ముందుగా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన రోమేనియా, పోలాండ్, స్లోవేకియా, హంగేరీ, మల్టోవా దేశాలకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నారు. తాజాగా ఆపరేషన్ గంగ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేశారు. ఇండియన్ ఏయిర్ ఫోర్స్ సీ -17 విమానాల ద్వారా తరలించేందుకు సిద్ధం అయింది ఇండియన్ గవర్నమెంట్. ఇప్పటికే పలు సీ-17 విమానాలు పోలాండ్, రోమేనియ, హంగేరీలకు బయలుదేరాయి. ఈ దేశాల్లో ఎప్పటికప్పుడు నలుగురు కేంద్రమంత్రులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

తాజాగా 11 వ విమానం బుడాపెస్ట్ నుంచి ఢిల్లీకి 220 మందితో చేరుకుంది. ఇప్పటి వరకు 11 విమానాల ద్వారా 2450 మంది విద్యార్థులను ఇండియాకు చేరుకున్నారు. వారందరికీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్వాగతించారు. ఈ మూడు రోజుల్లో 26 విమానాల ద్వారా మరింత త్వరగా భారతీయులను ఇండియాకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news