ఉక్రెయిన్ పై రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ యుద్ధం ప్రకటించిన తర్వాత.. అంతర్జాతీయంగా దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఇప్పటికే ఆయన ఆస్తులను ఫ్రీజ్ చేయడం తో పాటు పలు దేశాలు దౌత్య పరంగా కూడా రష్యాపై ఆంక్షలు విధిస్తున్నారు. ఇక క్రీడా రంగంలోనూ రష్యా కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఫుల్ బాల్ కు సంబంధించి వరల్డ్ కప్ తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లు, లీగ్ లు రష్యా ఆడకుండా.. ఫిఫా నిర్ణయం తీసుకుంది.
అలాగే పుతిన్ కు సంబంధించి ఇప్పటికే అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ అధ్యక్ష పదవిని కోల్పోవాల్సి వచ్చింది. తాజా గా వరల్డ్ తైక్వాండో ఫెడరేషన్ కూడా పుతిన్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు పుతిన్ కు ఉన్న తైక్వాండో బ్లాక్ బెల్డ్ ను ఫెడరేషన్ తొలగించింది. అలాగే రష్యా తో పాటు బెలారస్ లలో ఇక నుంచి ఎలాంటి తైక్వాండో పోటీలును, ఈవెంట్ లను నిర్వహించామని అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని తైక్వాండో ఫెడరేషన్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది.