రష్యా విషయంలో అమెరికాకు భారత్ మరో సారి షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తు.. ఐక్య రాజ్య సమతి భద్రతా మండలిలో అమెరికా తీర్మానం చేసింది. కాగ తీర్మానానికి అమెరికా, పోలండ్, ఇటలీ, న్యూజీలాండ్ తో సహా మొత్తం 11 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. కానీ భారత్ ఈ తీర్మానానికి దూరంగా ఉంది. భారత్ తో పాటు చైనా, యూఏఈ కూడా ఈ తీర్మానానికి చేపట్టిన ఓటింగ్ కు దూరం గా ఉన్నాయి.
కాగ ఇటీవల కూడా ఐక్య రాజ్య సమతి భద్రతా మండలిలో రష్యాపై తీర్మాణం చేశారు. అప్పుడు కూడా భారత్ ఓటింగ్ కు దూరంగానే ఉంది. ఉక్రెయిన్ – రష్యా మధ్య నెలకొన్న సమస్యలు చర్చలు. దౌత్య పరంగా మాత్రమే పరిష్కరం అవుతాయని భారత్ అభిప్రాయ పడింది. ఇతర దేశాలు ఈ సమస్యల జోక్యం చేసుకుంటే.. సమస్య తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని భారత్ అభిప్రాయ పడింది.
కాగ బెలారస్ సరిహద్దుల్లో ఉక్రెయిన్ తో చర్చించడానికి రష్యా అంగీకరించడం పట్ల భారత్ హర్షం వ్యక్తం చేసింది. చర్చల పట్ల రెండు దేశాలు చేసిన ప్రకటనలు తాము స్వాగతిస్తున్నట్టు భారత్ తెలిపింది.