మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఝలక్ ఇచ్చారు. మంచు విష్ణు ఆఫీస్‌లో భారీ చోటు చోటు చేసుకుంది. ఫిల్మ్‌నగర్‌లోని మంచు విష్ణు కార్యాలయంలో రూ.5లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి చోరీకి గురైంది. దీంతో ఈ ఘటనపై మంచు విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మంచు విష్ణు విష్ణు వద్ద బోరబండకు చెందిన యూ నాగశ్రీ హెయిర్ స్టైలిస్ట్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 17న జూబ్లీహిల్స్ సీబీఐ కాలనీలోని కార్యాలయంలో విష్ణుకు చెందిన రూ.5లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్, మేకప్ సామాగ్రిని చెప్పకుండా ఎలాంటి అనుమతి లేకుండా తీసుకెళ్లాడు. మొబైల్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. దీంతో చోరీకి పాల్పడినట్టు మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఈనెల 19న ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.