ఉక్రెయిన్ పై రష్యా తీవ్రంగా దాడి చేస్తోంది. ఈరోజు ఉదయం నుంచి ఉక్రెయిన్ మూడు వైపుల నుంచి రష్యన్ ఆర్మీ ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది. ఇప్పటికే 13 ఉక్రెయిన్ నగరాలను ఆక్రమించుకుంది రష్యన్ ఆర్మీ. మరోవైపు ఐక్యరాజ్యసమితితో పాటు.. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు రష్య యుద్దం ఆపాల్సిందిగా కోరుతున్నాయి. రష్యా దాడికి ఉక్రెయిన్ నుంచి పెద్దగా ప్రతిఘటన కూడా ఎదురుకావడం లేదు.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్- రష్యా మధ్య వార్.. ప్రత్యక్షంగా ఈ ప్రభావం భారత్ పై పడనుంది. ముఖ్యంగా రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న ఎస్ -400 క్షిపణి విధ్వంసక వ్యవస్థ కొనుగోలు డీల్ చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అమెరికా.. భారత్ రష్యా నుంచి ఎస్-400 ను కొనుగోలు చేయవద్దని ఆదేశించే అవకాశం ఉంది. అమెరికా కాట్సా చట్టం పరిధిలోకి భారత్ ను తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది.
ఇదిలా ఉంటే రష్యా నుంచి ముడి చమురు దిగుమతి తగ్గి పెట్రోల్ , డిజిల్ ధరలు పెరగొచ్చు. దీంతో పాటె రష్యా, ఉక్రెయిన్ నుంచి భారత్ గోధుమల దిగుమతి తగ్గుతుంది. బీర్ల తయారీకి వాడే బార్లీ గింజల దిగుమతి తగ్గి బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. భారత్ కు ఉక్రెయిన్ నుంచి పెద్ద ఎత్తున సన్ ఫ్లవర్ దిగుమతి అవుతోంది… మన దిగుమతి చేసుకునే సన్ ఫ్లవర్ లో 75 శాతం ఉక్రెయిన్ నుంచే వస్తోంది. దీంతో రానున్న రోజుల్లో సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.