ఉక్రెయిన్ – రష్యా మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. విదేశీయులు తరలివెళ్లడానికి ఐదున్నర గంటలు సమయం ఇచ్చింది. విదేశీయులు తరలివెళ్లడానికి వీలుగా… మారియుపోల్ మరియు వోల్నోవాఖాలో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా. అక్కడి కాలమాన ప్రకారం ఉదయం 9 గంటల నుంచి ఐదున్నర గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది. ఈసమయం ముగియడంతో రష్యా మళ్లీ తన భీకర దాడులను కొనసాగిస్తోంది. ప్రధాన నగరాలే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. రాజధాని కీవ్ సమీపంలోని గ్రామాలను టార్గెట్ చేసుకుంటూ.. దాడులు చేస్తోంది. ఈ దాడిలో ఒక చిన్నారితో సహా 6 మంది చనిపోయారు. వోల్నావోఖ నగరంపై క్షిపణులతో విరుచుకుపడింది రష్యా. చెర్నివ్ నగరంపై కూడా దాడులు చేస్తోంది. ప్రస్తుతం మరియోపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సేనలు కదులుతున్నాయి. ఆ నగరానికి విద్యుత్ , నీరు, ఆహారాన్ని అడ్డుకున్నారు. ఈ ఒక్క రోజే రష్యా 24 క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు ఖేర్సన్ నగరంలోని వీధుల్లోకి వందలాది మంది ఉక్రెయిన్లు వచ్చి రష్యా సైన్యాన్ని నిలువరిస్తున్నారు. తిరుగబడుతున్నారు. వెంటనే మీ దేశానికి వెళ్లిపోవాలంటూ.. పోరాటం చేస్తున్నారు.
మళ్లీ మొదలైన యుద్ధం… ఉక్రెయిన్ పై భీకర దాడులతో విరుచుకుపడుతున్న రష్యా…
-