ఉక్రెయిన్- రష్యా పరిణామాల మధ్య ఇండియన్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడెప్పుడు స్వదేశానికి వస్తామా.. అని ఎదురుచూస్తున్నారు. దీనికి అనుగుణంగా విదేశాంగ శాఖ కూడా అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలు రోమేనియా, హంగరీ, పోలాండ్ ద్వారా భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఉక్రెయిన్ లోని భారతీయులకు విదేశాంగ శాఖ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. సరిహద్దుల్లోని ఇండియన్ అధికారులు, ఎంబసీ అధికారులకు సమాచారం లేకుండా.. ఉక్రెయిన్ బార్డర్ కు వెళ్లవద్దని సూచించింది. సరిహద్దులు ప్రాంతాలు సెన్సిటివ్ గా ఉన్నాయని… విద్యార్థులు పశ్చిమ ప్రాంతాల్లో నగరాలు ఉండాలని సూచించింది. ఇదిలా ఉంటే తూర్పు ప్రాంతాల్లో ఉన్న భారతీయులు ఎక్కడిక్కడే ఉండాలని.. వారి కదలికలు తగ్గించుకోవాలని, షెల్టర్ లు, అండర్ గ్రౌండ్ కావాాలని ఆదేశించింది.
భారత ప్రభుత్వం సరిహద్దు దేశాల్లోని ఎంబసీలతో చర్చిస్తుందని.. భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుందని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఎలాంటి సమాచారం లేకుండా సరిహద్దులకు చేరుకుంటే.. ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని విదేశాంగ శాఖ వెల్లడించింది.