యుద్ధం ఆపేస్తాం … కానీ అందుకు ఉక్రెయిన్ ఒప్పుకోవాలని రష్యా డిమాండ్

-

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయి నెల రోజులు గడిచిపోయింది. అయినా రష్యా దాడులు ఆగడం లేదు. ఉక్రెయిన్ ను దారిలోకి తెచ్చుకునేందుకు ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తోంది. ఇప్పటికే మరియోపోల్, ఖార్కీవ్, కీవ్ నగరాలను మసిదిబ్బలుగా మార్చింది. తాజాగా బుచాలో రష్యా దారుణ మారణకాండ వెలుగులోకి వచ్చింది. అమాయకులైన పౌరులను అత్యంత దారుణంగా చంపేసింది. ఈ ఘటన ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది. ఇటీవల ఇస్తాంబుల్ లో జరిగిన చర్చల్లో ముందడుగు పడింది. కీవ్, చెర్నీవ్ నుంచి రష్యన్ బలగాలను వాపస్ తీసుకుంటామని రష్యా నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆపాలంటే ఒక విషయానికి కట్టుబడాలని డిమాండ్ చేస్తోంది. చర్చల సందర్భంగా తాము సూచించిన షరతులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ హామీ ఇస్తే మిలిటరీ యాక్షన్ నిలపి వేస్తామని రష్యా ప్రకటించింది. నాటో లో చేరాలనుకుంటున్న ఉక్రెయిన్ తన అన్ని ప్రయత్నాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఇటీవల పుతిన్, జెలన్ స్కీ మధ్య చర్చలు జరగాల్సి ఉన్నా బుచా ఊచకోతతో పుతిన్ తో చర్చలకు జెలన్ స్కీ ససేమిరా అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version