BREAKING : రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ తిరస్కరణ

-

యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యాతో బెలారస్ లో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తిరస్కరించారు. తమ దేశంపై రష్యా జరుపుతున్న దాడుల్లో కొన్ని గడ్డపై నుంచి జరుగుతున్నాయని చెప్పారు. ఉక్రెయిన్ పై క్షిపపనుల ప్రయోగానికి వేదికలు కానటువంటి దేశాల్లో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని… జెలెన్స్కీ తెలిపారు.వర్శా, ఇస్తాంబుల్, బక్ లలో శాంతి చర్చల వేదికను ఏర్పాటు చేయవచ్చునని సూచనలు చేశారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపింది వివరాల ప్రకారం… రష్యా ప్రతినిధి బృందం ఇప్పటికే బెలారస్ లోని నగరానికి చేరుకుంది. ఉక్రెయిన్ ప్రతినిధుల కోసం వేచి చూస్తోంది. కానీ గోమేల్ నగరానికి తాము రాబోమని ఉక్రెయిన్ ప్రకటించినట్లు సమాచారం అందుతోంది.

ఉక్రెయిన్ లో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలపై రష్యన్ దళాలు బాంబులు కనిపించాయని… శనివారం అలాగే ఆదివారం మధ్య రాత్రి అత్యంత కిరాతకంగా వ్యవహరించాలని ఆ దేశ అధ్యక్షుడు ఫైరయ్యారు. మిలటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని… ప్రజలు నివసించే చోట దాడులు చేశారని మండిపడ్డారు. అంబులెన్స్ లతోపాటు ప్రతి దాని పై దురాక్రమణ దారులు దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇలాంటి సమయంలో తాము చర్చలకు ఎలా వస్తాను అంటూ ప్రశ్నించారు అధ్యక్షుడు.

Read more RELATED
Recommended to you

Latest news