పోలవరం ప్రాజెక్టుకు ఇక ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చిచెబుతోందని ఉండవల్లి అన్నారు. పోలవరంకు 47 వేల కోట్ల రూపాయలు ఇవ్వమని కేంద్రం బాహాటం చెబుతుంటే ఏపీ ప్రభుత్వం ఇంకా ఎలా నమ్ముతోందని ప్రశ్నించారు. దశల వారీగా అయినా పోలవరంకు పూర్తి నిధులు ఇచ్చేలా కేంద్రంతో కమిట్ చేయించండని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ గారిని పొగడం నా పని కాదన్న ఆయన ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని అన్నారు.
ప్రత్యేక హోదా, పోలవరం అంశాల వల్లే జగన్ భారీ మెజారిటీతో గెలిచారని, అలాంటి పోలవరం ప్రాజెక్టుకు నిధులు అంశాన్ని ప్రత్యేక హోదాలా మార్చొద్దని అన్నారు. కేసులకు భయపడి జగన్ కేంద్రాన్ని నిలదీయడం లేదని జనం నమ్మే పరిస్థితి తెచ్చుకోకండని ఆయన హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెబితే కేంద్రం నిధులు ఇస్తుందని అనుకోవడం అవివేకం అని అన్నారు. పోలవరం నిధుల కోసం మోదీ ప్రభుత్వంతో గొడవ పడమని జగన్ ప్రభుత్వానికి చెప్పడం లేదు, ఎపి హక్కును సాధించండని అన్నారు.