అదేంటి అనుకుంటున్నారా ? అవును నిజమే, దానికి కొన్ని నకిలీలు తయారయ్యాయి. అసలు విషయం ఏమిటంటే భూ సమగ్ర సర్వేల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ధరణి వెబ్సైట్ కు నకిలీల బెడద తప్పలేదు. వెబ్ ధరణి పేరుతో మొబైల్ యాప్ క్రియేట్ చేసి ఒక వెబ్ సైట్ లో పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు.
అయితే ధరణి పేరుతో నకిలీ మొబైల్ యాప్ క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. 5 రోజుల క్రితం టీఎస్ టీఎస్ డైరెక్టర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఐపి అడ్రస్ ఆధారంగా కర్ణాటకలోని బసవ కళ్యాణ్ గ్రామానికి చెందిన మహేష్ , ప్రేమ్ మూలె అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ నాంపల్లి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు.