నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఇలా చేస్తే జాబ్‌ పొందవచ్చు..!

-

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని ఎంతో మంది ఉపాధిని కోల్పోయిన సంగతి తెలిసిందే. అనేక మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. దీంతో వారు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే అలాంటి నిరుద్యోగులను ఆదుకునేందుకు, వారికి అవసరం అయిన శిక్షణ, నైపుణ్యాలను అందజేసి వారికి మళ్లీ ఉద్యోగం ఇప్పించేందుకు కేంద్రం నడుం బిగించింది. అందులో భాగంగానే కేంద్రం ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)తో ఒప్పందం చేసుకుంది.

unemployed can join ION course by TCS and can get job

దేశంలో నిరుద్యోగులకు సహాయం అందించేందుకు టీసీఎస్‌ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ కేంద్రంతో ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగానే టీసీఎస్‌.. అయాన్‌ పేరిట ఓ కోర్సును ప్రారంభించింది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు అనేక అంశాల్లో శిక్షణ ఇస్తారు. అలాగే శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థులకు ఉద్యోగాలు, ఉపాధిని కూడా కల్పిస్తారు. అయితే అందుకు గాను అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్‌ కెరీర్‌ సర్వీసెస్‌ (ఎన్‌సీఎస్‌) పోర్టల్‌లో తమ పేరును రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అయాన్‌ కోర్సులో శిక్షణ తీసుకుని తద్వారా నిరుద్యోగులు తమ ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగు పరుచుకోవచ్చు.

కాగా ఇప్పటి వరకు సదరు పోర్టల్‌లో 1 కోటి మంది వరకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 73 లక్షల మందికి ఇప్పటికే ఉపాధి లభించింది. ఇక ఎన్‌సీఎస్‌లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1000 ఉపాధి ఎక్స్‌ఛేంజ్‌లు, 200 మోడల్‌ ఉపాధి కేంద్రాలు నమోదు అయినట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

అయాన్‌ కోర్సులో భాగంగా అభ్యర్థులకు వ్యక్తిత్వ వికాసం, జీవ నైపుణ్యాలు వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. పరిశ్రమలు, సంస్థలలో అత్యుత్తమ సేవలు అందించేందుకు కావల్సిన నైపుణ్యాలను అభ్యర్థులకు నేర్పిస్తారు. దీంతో వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతం ఈ కోర్సును ఇంగ్లిష్, హిందీ భాషల్లో బోధిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news