మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ చేయబోయో డైరెక్టర్ ఫిక్స్ ఎవరంటే…?

-

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో “రౌద్రం రణం రుధిరం” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా గా చరణ్..కొమరం భీం గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ త్రివిక్రం దర్శకత్వంలో నటిస్తాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాలో నటించే అవకాశాలున్నాయని అంటున్నారు.

 

ఇక రామ్ చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “ఆచార్య” లో ఒక కీలక పాత్ర పోషించనున్నట్టుగా ఇప్పటికే ఖరారు అయ్యింది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ ఎవరి దర్శకత్వంలో నటిస్తారన్న వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. ఇప్పటికే వంశీ పైడిపల్లి, సురేంద్ర రెడ్డి సినిమాలు చరణ్ లైన్లో పెట్టాడని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తుంది.

అయితే తాజాగా వినిపిస్తున్న ఫ్రెష్ న్యూస్ ఏమిటంటే రామ్ చరణ్ మరో యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. సుమంత్ హీరోగా వచ్చిన “మళ్ళీరావా”, నేచురల్ స్టార్ నాని నటించిన “జెర్సీ” లాంటి సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి తో చరణ్ తర్వాత సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ లెక్కన చూస్తే రామ్ చరణ్ మూడు ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news