Union Budget 2022: బడ్జెట్-2022 హైలెట్స్‌ ఇవే

-

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ లోక్సభలో కాసేపటి క్రితమే 2022 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ… కరోనా కట్టడి లో వ్యాక్సినేషన్ బాగా కలిసి వచ్చిందని.. ప్రజల ప్రాణాలు కాపాడటం టీకా బాగా పని చేసిందని తెలిపారు. పేద అలాగే మధ్యతరగతి సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని నిర్మల సీతారామన్ ప్రకటించారు.

ఇక దేశంలో ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్

కేంద్ర బడ్జెట్‌ -2022 ను పార్లమెంట్‌ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టారు. కేంద్రం నూతనంగా తీసుకువచ్చే.. భూ సంస్కరణల గురించి.. కీలక విషయాలు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేషన్‌ పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. దేశం లో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ఆధునిక వ్యవస్థను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

2023ను తృణ ధ్యానాల సంవ‌త్స‌రంగా ప్ర‌క‌టించిన కేంద్రం

2023 ను తృణ ధ్యానాల సంవ‌త్స‌రంగా ప్ర‌క‌టిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వంట నూనెల కోసం దిగుమ‌తుల‌పై ఆధార‌ప‌డ‌కుండా దేశీయంగా ఉత్ప‌త్తి చేయాలని.. పీపీపీ మోడ‌ల్‌లో ఆహార శుద్ధి ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్రోత్సాహం ఉంటుందని స్పష్టం చేశారు. ర‌సాయ‌న ర‌హిత వ్య‌వ‌సాయ అభివృద్ధికి మ‌రింత ప్రోత్సాహం ఉంటుందని.. సేంద్రీయ ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి ప్ర‌త్యేక ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. చిరు ధాన్యాల అభివృద్ధికి అద‌న‌పు ప్రోత్సాహం ఇస్తామన్నారు.

త్వరలోనే డిజిటల్ కరెన్సీ…

దేశంలో త్వరలోనే డిజిటల్ కరెన్సీని తీసుకురానున్నారు. 2022-23 బడ్జెట్ ప్రసంగంలో నిర్మల సీతారామన్ వెల్లడించారు. దేశంలోొ త్వరలో డిజిటల్ రూపీని తీసుకువస్తామని ఆమె వెల్లడించారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇతర టెక్నాలజీల సాయంతో దీనిని ఆర్బీఐ 2022-23 లో అందుబాటులోకి తీసుకు వస్తుందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది అండగా ఉంటుందని.. ఆమె అంచనా వేశారు.క్రిప్టో కరెన్సీ వంటి డిజిటల్ ఆస్తుల్లో పెట్టుబడులు పెరగడంతో దీన్ని కూడా పన్నుల పరిధిలోకి తీసుకువస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. డిజిటల్ ఆస్తి నుంచి పొందే ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

IT returns: ఐటీ రిటర్నులు దాఖలు చేసుకునే వారికి కేంద్రం శుభవార్త

ఐటీ రిటర్నుల దాఖలు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఐటీ రిటర్న్‌ ల దాఖలులో మరో వెసులుబాటు కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆదాయపన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్‌డేట్‌ చేసుకునే వెసులు బాటు అందించారు. అంటే రిటర్న్‌ లు సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణలు చేసుకోవచ్చు.అదే విధంగా కోటి కుటుంబాలకు ఉత్వల పథకం విస్తరించనున్నట్లు ప్రకటన చేశారు. సహకారం సంఘాలపై సర్‌ చార్జీని తగ్గించనున్నారు. ప్రత్యామ్నాయ పన్ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గింపు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేశారు.

రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త..వడ్డీ లేకుండా రూ.లక్ష కోట్ల రుణాలు

రాష్ట్రాలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తీపికబురు చెప్పారు. రాష్ట్రాల కోసం రూ. లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు మంత్రి నిర్మలా సీతారామన్‌. రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ. లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నామని.. ఈ ప్రత్యేక నిధి ద్వారా అన్ని రాష్ట్రాలకు రూ. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పారు.పీఎం గతిశక్తి పథకం ద్వారా మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌… వచ్చే మూడేళ్లలో కొత్తగా 400 వందే భారత్‌ రైళ్లు ప్రవేశపెడుతున్నామన్నారు.

త్వరలోనే పేదలకు 80 లక్షల ఇండ్ల నిర్మాణం

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కాసేపటి క్రితమే… లోక్‌ సభలో 2022 బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె దేశంలోని నిరు పేదలకు శుభవార్త చెప్పారు. పీఎం ఆవాస యోజన పథకం కింద నిరు పేదలకు ఏకంగా 80 లక్షల ఇండ్లను నిర్మిస్తామని సంచలన ప్రకటన చేశారు. నిరుపేదలను ఆదుకునే విధంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. అలాగే..5.7 కోట్ల కుటుంబాలకు నల్‌ సే జల్‌ కింద మంచినీటిని అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు.

ఈ ఏడాది దేశంలో 5 జీ టెక్నాలజీ..

2022-23 బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నుంచే దేశంలో 5 జీ టెక్నాలజినీ తీసుకువస్తామని వెల్లడించారు. 2022-23 లో డిజిటల్ చిప్ లతో కూడిన ఈ- పాస్ పోర్టుల జారీకి కొత్త టెక్నాలజీని జారీ చేస్తామని చెప్పారు. 1.2 లక్షల పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్, ఏటీఏం సేవలను ప్రారంభిస్తామని వెల్లడించారు. దేశంలో 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పార్లమెంట్ లో వెల్లడించారు. చెల్లింపుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు ఆన్లైన్ బిల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news