ప్రభుత్వ రంగ బ్యాంకులు గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నుండి 10 వేల కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నాయని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ లార్జ్ క్రెడిట్ డేటాబేస్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ఉద్దేశపూర్వక ఎగవేతదారులు 219, వారి సొంత మొత్తం 12 వేల 338 కోట్ల రూపాయలని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు మోసాలను సిబిఐకి ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ తో సహా నివేదిస్తాయని ఆయన స్పష్టం చేసారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు 512 కేసులను సిబిఐలో నమోదు చేశాయని, 2018 సంవత్సరం నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 269 కేసుల్లో ప్రాసిక్యూషన్ ప్రారంభించామని ఆయన చెప్పారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని మంత్రి పేర్కొన్నారు.