షాకింగ్‌.. పిల్ల‌ల చ‌దువుల‌కు ఫోన్లు కొనేందుకు పేరెంట్స్ రూ.70 కోట్లు ఖ‌ర్చు పెట్టారు..

-

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం దేశంలోని విద్యార్థులంద‌రూ ఆన్‌లైన్‌లో క్లాసుల‌కు హాజ‌ర‌వుతున్నారు. నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ కంప్యూట‌ర్ల ఎదుట కూర్చుని పాఠాల‌ను నేర్చుకుంటున్నారు. అయితే ఆన్‌లైన్ క్లాసులు జ‌ర‌గ‌డం ఏమో గానీ విద్యార్థుల చ‌దువుల కోసం త‌ల్లిదండ్రులు మ‌రిన్ని ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంది.

parents spent about rs 70 crore on smart phones for their childrens online classes

తెలంగాణ‌లో సెప్టెంబ‌ర్ 1వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్ క్లాసుల‌కు హాజ‌రు అవుతున్న వారి సంఖ్య 1,91,768 ఉండ‌గా ఇప్ప‌డది 2,19,285కి చేరుకుంది. అంటే.. ఎప్ప‌టిక‌ప్పుడు ఆన్‌లైన్ క్లాసులకు హాజ‌ర‌వుతున్న వారి సంఖ్య పెరుగుతుంద‌ని అర్థం. ఇక ఎక్కువ మంది త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌లు ఆన్‌లైన్ త‌ర‌గతుకు అటెంట్ అవ‌డం కోసం గాను వారికి ఫోన్ల‌ను కొనిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే త‌ల్లిదండ్రులు కేవ‌లం ఫోన్ల‌ను కొనుగోలు చేయ‌డం కోస‌మే ఈ మధ్య కాలంలో రూ.70 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టార‌ని తెలుస్తోంది. ఇందుకు గాను ప‌లువురు త‌ల్లిదండ్రులు లోన్లు కూడా తీసుకుంటున్నార‌ని స‌మాచారం.

పిల్ల‌ల చ‌దువుల‌కు గాను అనేక మంది త‌ల్లిదండ్రులు అప్పులు చేస్తూ ఫోన్ల‌ను కొన‌నిస్తున్నారు. అలాగే వారికి ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం అందిస్తున్నారు. దీంతో వారికి ఖ‌ర్చుల భారం పెరిగింది. అస‌లే క‌రోనాతో ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధి లేక ఇబ్బందులు ప‌డుతున్న త‌ల్లిదండ్రుల‌కు ఈ ఆన్‌లైన్ ఖ‌ర్చులు మ‌రింత భారం అవుతున్నాయి. మ‌రి ఈ క‌ష్టాలు వారికి ఎన్నాళ్లు ఉంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news