వచ్చే మూడు, నాలుగు నెలల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ సిద్ధమవుతుందనే నమ్మకం ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎఫ్ఐసిసిఐ ఎఫ్ఎల్ఓ వెబ్‌నార్ లో ‘ది షిఫ్టింగ్ హెల్త్‌కేర్ పారాడిగ్మ్ డ్యూరింగ్ అండ్ పోస్ట్-కోవిడ్’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. రాబోయే మూడు-నాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధంగా ఉంటుందని నాకు నమ్మకం ఉందన్నారు.
టీకా అందించేది శాస్త్రీయ డేటా ఆధారంగా రూపొందిస్తామని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ కార్మికులు మరియు కరోనా యోధులకు సహజంగానే ప్రాధాన్యతఇస్తామన్నారు. తరువాత వృద్ధులకు ఇస్తామని చెప్పారు. 2021 జూలై-ఆగస్టు నాటికి 25-30 కోట్ల మందికి 400-500 మిలియన్ మోతాదులు అందుబాటులోకి వస్తాయని వర్ధన్ అభిప్రాయపడ్డారు. 65 ఏళ్లు పైబడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని అని అన్నారు.