మొబైల్స్ తయారీదారు వివో తన యూజర్లకు శుభవార్త చెప్పింది. త్వరలోనే ఓ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను తన స్మార్ట్ ఫోన్లు వాడే యూజర్లకు అందివ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో వివో తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్.. ఆరిజిన్ ఓఎస్‌ను విడుదల చేసింది. వివో ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆధారిత ఫర్ టచ్ ఓఎస్ ఉండేది. కానీ ఇకపై దానికి బదులుగా ఆరిజిన్ ఓఎస్ లభ్యం కానుంది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నట్లు వివో ప్రకటించింది.
ఇక వివో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఆరిజిన్ ఓఎస్‌ను పలు వివో ఫోన్లకు విడతలవారీగా అందజేయనున్నారు. జనవరిలో వివో నెక్స్ 3ఎస్, ఎక్స్50 ప్రొ ప్లస్, ఎక్స్50 ప్రొ, ఎక్స్50, వివో ఎస్7 ఫోన్లకు ఆరిజిన్ ఓఎస్ లభిస్తుంది. అలాగే ఫిబ్రవరిలో వివో నెక్స్ 3, నెక్స్ 3 5జి, ఎక్స్30, ఎక్స్ 30 ప్రొ ఫోన్లకు, 2021 ఏప్రిల్ వరకు వివో ఎక్స్27 ప్రొ, ఎక్స్ 27, ఎస్6, ఎస్5, ఎస్1 ప్రొ, ఎస్1, జడ్6, జడ్5ఎక్స్, జడ్5ఐ, జడ్5, నెక్స్ డ్యుయల్ స్క్రీన్, నెక్స్ ఎస్, నెక్స్ ఫోన్లకు ఆరిజిన్ ఓఎస్ అప్‌డేట్ లభిస్తుంది.
అలాగే ఐక్యూ ఫోన్లకు కూడా ఇదే ఆపరేటింగ్ సిస్టమ్‌ను త్వరలో అందిస్తారు. ఐక్యూ 5ప్రొ, 5, 3, ఐక్యూ ప్రొ, ఐక్యూ, ఐక్యూ నియో 3, నియో, నియో855, ఐక్యూ జడ్1ఎక్స్, జడ్1 ఫోన్లకు ఈ ఓఎస్ లభిస్తుంది. కాగా ఆరిజిన్ ఓఎస్‌ను కూడా ఆండ్రాయిడ్ ఆధారంగానే తీర్చిదిద్దారు. అందువల్ల ఇందులోనూ గూగుల్ ప్లే స్టోర్‌కు సపోర్ట్ లభిస్తుంది. ఈ క్రమంలో యూజర్లు ప్లే స్టోర్‌లోని యాప్స్‌ను ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.