కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ములుగు జిల్లా పర్యటనలో భాగంగా తాటి కల్లు సేవించారు. బీజేపీ ఆధ్వర్యంలో నేడు కొనుగోలు కేంద్రాల పరిశీలన కార్యక్రమం ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాల్లో బీజేపీ నేతలు పర్యటనతో పాటు ధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియను వారు పరిశీలించనున్నారు.కల్లాల్లో ధాన్యాన్ని సీసీఐ అధికారులు కొనడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే బీజేపీ నేతలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం కరీంనగర్ నుంచి బండి సంజయ్ ములుగు పర్యటనకు వెళ్లారు. వెళ్లే దారిలో ప్రమాదవశాత్తు లారీ కింద పడిన యువతిని స్థానికుల సాయంతో రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ములుగు వెళ్లే క్రమంలోనే ఓ చోట ఆగి తాటి కల్లు తాగారు. ఆకు పట్టి కేంద్రమంత్రి కల్లు తాగుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.