శరీరాన్ని, మనసును కలిపే ప్రక్రియ యోగా: కిషన్‌రెడ్డి

-

హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన యోగా మహోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యోగాసనాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ యోగా వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.  యోగా అంటే శరీరాన్ని, మనసును కలిపే ప్రక్రియ అని కిషన్ రెడ్డి అన్నారు. ప్రాణులు ప్రకృతితో మమేకమవ్వడమే యోగా అంతరార్థమని తెలిపారు. ఇవాళ ప్రపంచమంతా యోగా వైపు చూస్తోందని యోగా అలవాటు చేసుకుంటే విజయాలన్నీ చేకూరతాయని అన్నారు.

మరోవైపు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రధానిగా మోదీ నిర్ణయాన్ని ప్రపంచమంతా ఆచరిస్తోందని  అన్నారు. మోదీ వల్ల యోగాకు అన్ని దేశాల్లో ప్రాముఖ్యత లభించిందని .. కులమతాలకు అతీతంగా అందరూ నేర్చుకోవాల్సిన విద్య యోగా అని పేర్కొన్నారు.

మరోవైపు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరిగాయి.  హైదరాబాద్‌లోని కన్హ శాంతివనంలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమలో తెలంగాణ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ పాల్గొన్నారు. వరంగల్‌లోని సీకేఎం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో చినజీయర్‌ స్వామి … కరీంనగర్‌లోని జ్యోతినగర్‌ మున్సిపల్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పాల్గొని యోగాసనాలు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news