ఎన్డీయేతో వైసీపీ కలిస్తేనే.. ఏపీ అభివృద్ది : కేంద్ర మంత్రి

-

విశాఖలో పర్యటించిన కేంద్ర సోషల్ జస్టిస్ సహాయ మంత్రి రాందాస్ అథవాలే షాకింగ్‌ కామెంట్స్ చేశారు. వైయస్ఆర్ సీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం లో భాగస్వామ్యం అయితే ఆంధ్ర ప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. బీజేపీ పార్టీ కూడా వైయస్సార్ సీపీ లాంటి పార్టీనేనని… కేంద్రంలో భాగస్వామ్యం కావడంతో ఏపీ అభివృద్ధి త్వరగా జరుగుతుందని తెలిపారు.

జాతీయ రహదారులు…టూరిజం ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకునే అవకాశం వుంటుందని.. కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ పార్టీ…. కానీ ఇప్పుడు పతనం అవుతోందని వెల్లడించారు.

పాకిస్థాన్ పీవోకె కి దూరంగా ఉంటే మంచిదని.. పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఈ విషయంలో చొరవ తీసుకుంటే పాక్ అభివృద్ధి జరుగుతుందన్నారు. మూడు రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలో అంశమని.. కేంద్రం పరిధిలో లేదని తేల్చిచెప్పారు. పరిశ్రమల ప్రైవేట్ పరం చెయ్యడం కాంగ్రెస్ పార్టీ లో కూడా జరిగిందని… నష్టాల్లో వున్న పరిశ్రమలను ప్రైవేటీకరిస్తే ఎస్సీ..ఎస్టీ..బీసీ రిజర్వేషన్ లు అమలు చెయ్యాలని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news