హాథ్రస్ కు సీఎం యోగీ.. క్షతగాత్రులకు పరామర్శ

-

ఉత్తర్‌ప్రదేశ్‌ హాథ్రస్లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన గురించి తెలిసిందే. ఈ ఘటనలో మరో 28 మంది గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని సహా పలు రాష్ట్రాల నేతలు కూడా విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా హాథ్రస్‌లో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటించారు.

తొలుత పోలీసు అధికారులతో సమావేశమై పరిస్థితిపై ఆరా తీసిన యోగి.. ఈ కేసు దర్యాప్తు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాథ్రస్ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్లిన సీఎం యోగి, చికిత్స అందిస్తున్న తీరును అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధితుల కుటుంబ సభ్యులను కూడా ముఖ్యమంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మరోవైపు ఈ ఘటనపై సమాజ్వాదీ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేశ్ యాదవ్ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేస్తూ.. ఇది చాలా బాధాకరమైన సంఘటన అని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి సరైన చిక్సిత అందక కొందరు మరణించారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version