వాళ్లది రిమోట్‌ కంట్రోల్‌ సర్కార్ : ప్రధాని మోదీ

-

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరాజయానికి సంబంధించి కాంగ్రెస్‌ నేతలు అన్య మనస్కంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్షం హయాంలో రిమోట్‌ కంట్రోల్‌ ప్రభుత్వాన్ని నడిపిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఐదేళ్లు పేదరికానికి వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో పేదలకు అనుకూల నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. అభివృద్ధి విస్తరణతో ప్రజలకు ప్రయోజనాలు చేకూరుతాయని వివరించారు. టైర్‌-2, టైర్‌-3 పట్టణాలు అభివృద్ధిలో భాగస్వాములవుతాయని ప్రధాని మోదీ తెలిపారు.

“దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుస్తాం. ఆర్థిక వృద్ధిలో భారత్‌ను పది నుంచి ఐదో స్థానానికి తీసుకువచ్చాం. ఆర్థిక వృద్ధిలో భారత్‌ను మూడో స్థానానికి తీసుకువస్తాం. పదేళ్లలో చేసిన అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్త ఉత్సవాలు నిర్వహించాలి. ఈ ఎన్నికలు భవిష్య సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తాయి. “అని రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version