బెస్ట్ సీఎం ఇలాఖాలో అన్నం, రొట్టెలు నంచుకోడానికి ఉప్పు..!! వీడియో

-

యూపీ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. యూపీ అనగానే అందరికి గుర్తొచ్చేది యోగి ఆదిత్యానాద్ పేరు. దేశవ్యాప్తంగా బెస్ట్ సీఎం లలో యోగికి ఇటీవలే రెండవ స్థానం వచ్చింది. కానీ తాజా ఘటనతో యోగి పరువు గంగలో కలిసి పోయింది. గతంలో చిన్న పిల్లల మరణాల విషయంలో పరువు పోగొట్టుకున్న యూపీ ప్రభుత్వం, మరో మారు దేశవ్యాప్తంగా మరో సారి పరువు పోగొట్టుకుంది. అంతేకాదు యోగీ ఇదేమి పాలన అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకీ అసలేమి జరిగింది.

UP schoolchildren eat roti-salt under mid-day meal schememid-day meal

విద్యార్ధులకి స్కూల్స్ లోనే నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశ్యంతో మొదలు పెట్టిన మధ్యాహ్న భోజన పధకం కొంతమంది అధికారుల అక్రమాల వలన అభాసు పాలవుతోంది. ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ స్కూల్ లో చిన్నారులకి పౌష్టికాహారం ఇవ్వాల్సింది బదులుగా భోజన సమయంలో కూరకి బదులుగా ఉప్పు వేసి నంచుకోమని చెప్పడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

పిల్లలకి భోజనంలో కూరకి బదులు ఉప్పు అలాగే రొట్టెలలో నంచుకోవడానికి ఉప్పు వేసి తినమని చెప్తున్నారట. అభం శుభం తెలియని పిల్లలు అలాగే వాటిని తినడంతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి అంటూ నేషనల్ మీడియా వార్తా కధనం వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్న భోజనం సమయంలో పిల్లలు రొట్టెలలో ఉప్పు నంచుకుని తింటున్న వీడియోని ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దాంతో ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వ ఉన్నత అధికారి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ తో పాటు ఆ గ్రామ పంచాయతీ అధికారిని సస్పెండ్ చేశారు. ఇప్పటికే పలురకాలుగా విమర్శలు ఎదుర్కుంటున్న యోగి ప్రభుత్వానికి ఈ తాజగా ఘటన మరొక మచ్చనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version